Amani: ఇండస్ట్రీలో నేను చాలా ఫేస్ చేశాను: నటి ఆమని

Amani Interview

  • సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానన్న ఆమని  
  • చెల్లెలు పాత్రలు చేయించడానికి చూశారని వ్యాఖ్య 
  • అలాంటి పాత్రలు చేయనని చెప్పానని వెల్లడి    

నిన్నటితరం కథానాయికలలో ఆమనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆమె ఎంచుకున్న కథలు .. చేసిన పాత్రలు అలాంటివి. ఆ తరువాత ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ .. "అవకాశాల కోసం నేను సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అక్కడ చాలా రకాల పరిస్థితులు చూశాను" అన్నారు. 

"నేను ఏ సినిమా ఆఫీసుకి వెళ్లినా మా అమ్మ నా కూడా వచ్చేది. ఆమె లేకుండా రమ్మని అన్నవారు కూడా ఉన్నారు. ఆమె లేకుండా నేను రాను అని చెప్పేదానిని. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనేది తెలియడానికి నాకు కొంత సమయం పట్టింది. సినిమాల వైపుకు వెళ్లొద్దని నాన్న ఎందుకు చెప్పాడనేది అర్థమైంది" అని చెప్పారు. 

" కొంతమంది చెల్లెలి పాత్రలు .. కూతురు పాత్రలు చేయమని అడిగారు. అలా ఒక సినిమాలో చెల్లెలుగా చేస్తే వరుసగా అలాంటి పాత్రలే వస్తాయని నాకు తెలుసు. అందువలన హీరోయిన్ గా కాకుండా వేరే పాత్రలు చేయనని చెప్పేదానిని. అందువలన హీరోయిన్ వేషం సంపాదించుకోవడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది" అని చెప్పుకొచ్చారు.

Amani
Actress
Tollywood
  • Loading...

More Telugu News