Prakash Raj: 'రంగ మార్తాండ' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Ranga Marthanda lyrical song released

  • కృష్ణవంశీ రూపొందించిన 'రంగ మార్తాండ'
  • ఓ రంగస్థల కళాకారుడి ఆవేదనే ఈ కథ 
  • కీలకమైన పాత్రను పోషించిన బ్రహ్మానందం 
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ 
  • మనసును తాకే సిరివెన్నెల సాహిత్యం

కృష్ణవంశీ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'రంగ మార్తాండ' కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితం మరాఠీలో వచ్చిన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. ఒక రంగస్థల కళాకారుడి జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. అలాంటి ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 

'పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం .. రెండూ ఒకటే నాణానికి .. బొమ్మాబొరుసంతే..' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించారు. ఇళయరాజా స్వరపరచడమే కాకుండా, స్వయంగా ఆలపించారు.

'ఒక పాత్ర ముగిసింది నేడు .. ఇంకెన్ని మిగిలాయో చూడు, నడిపేది పైనున్న వాడు .. నటుడేగా నరుడన్నవాడు' వంటి లైన్స్ ఈ పాటకి హైలైట్. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prakash Raj
Ramyakrishna
BBrahmanandam
Ranga Marthanda Movie

More Telugu News