Allari Naresh: అల్లరి నరేశ్ కొత్త అవతారమే 'ఉగ్రం' .. టీజర్ రిలీజ్!

Ugram teaser released

  • అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన 'ఉగ్రం'
  • 'నాంది' దర్శకుడి మరో ప్రయత్నం ఇది
  • పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న హీరో 
  • కథానాయికగా 'మిర్నా' పరిచయం

తెలుగు తెరపై రాజేంద్రప్రసాద్ తరువాత హాస్య కథనాయకుడిగా అల్లరి నరేశ్ సందడి చేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. హాస్య కథానాయకుడిగా అలరిస్తూనే, అడపా దడపా అల్లరి నరేశ్ కొన్ని ప్రయోగాత్మక పాత్రలను చేస్తూ వెళ్లాడు. ఆ పాత్రల్లో ఒదిగిపోతూ మంచి మార్కులు కొట్టేశాడు. 

అందువలన ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక కథలను .. పాత్రలను చేయడానికే ఆయన ఎక్కువగా మొగ్గుచూపుతున్నాడు. అలా విజయ్ కనకమేడల దర్శకత్వంలో చేసిన 'నాంది' హిట్ కావడంతో, మళ్లీ ఆ దర్శకుడితోనే 'ఉగ్రం' సినిమా చేశాడు. ఈ సినిమాతో 'మిర్నా' తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం టీజర్ వలన తెలుస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allari Naresh
Mirna
Ugram Movie

More Telugu News