Pavan Kalyan: సముద్రఖనితో పవన్ ప్రాజెక్టు షురూ.. లేటెస్ట్ పిక్స్!

Pavan New Movie Update

  • తమిళంలో హిట్ కొట్టిన 'వినోదయా సితం'
  • వినోదమే ప్రధానంగా సాగే కథ 
  • ప్రధానమైన పాత్రలో పవన్ కల్యాణ్ 
  • ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సాయితేజ్ 
  • తెలుగులోనూ సముద్రఖనినే దర్శకుడు   

సముద్రఖని మంచి నటుడు మాత్రమే కాదు .. అంతకుముందే ఆయన రచయిత .. దర్శకుడు. ఆయన దర్శకత్వంలో 2021లో వచ్చిన 'వినోదయా సితం' తమిళ ప్రేక్షకులను అలరించింది. పూర్తి వినోదభరితమైన కంటెంట్ తో నడిచే కథ ఇది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, భారీ లాభాలను తెచ్చిపెట్టింది.అలాంటి ఈ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ తో సముద్రఖని చేయనున్నాడనీ, ఇందులో సాయితేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చింది. అది నిజమేనని నిరూపిస్తూ తాజాగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. అందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా వదిలారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాడనే అనిపిస్తోంది. పవన్ .. సాయితేజ్ లకు సముద్రఖని స్క్రిప్ట్ చూపిస్తూ ఉండటం .. స్క్రిప్ట్ ను పవన్ పరిశీలిస్తూ ఉండటం .. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ఇకపై ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు రానున్నాయి.

Pavan Kalyan
Sai Tej
Samudrakhani
Trivikram Srinivas
  • Loading...

More Telugu News