Surya: 'బాహుబలి 2' తరువాత మహారాజుగా ప్రభాస్ కనిపించే సినిమా ఇదే!

Prabhas in Surya Movie

  • సెట్స్ పై సూర్య 42వ సినిమా 
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ 
  • నిర్మాణ భాగస్వామిగా యూవీ క్రియేషన్స్ 
  • దర్శకత్వం వహిస్తున్న శివ

'బాహుబలి' సినిమాలో మహారాజుగా .. యువరాజుగా ప్రభాస్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఆయన లుక్ జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఈ పాత్రలో ప్రభాస్ ను తప్ప వేరెవరినీ ఊహించుకోలేం అనే టాక్ బలంగా వినిపించింది. ప్రభాస్ హైటూ .. ఆయన పర్సనాలిటీ ఆ పాత్రకి ఒక నిండుదనాన్నీ .. ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చిపెట్టాయి. 

'బాహుబలి 2' తరువాత ప్రభాస్ మళ్లీ రాజు గెటప్పులో కనిపించలేదు. కానీ మళ్లీ ఆయనను ఆ లుక్ లో చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. అలాంటివారి ముచ్చట త్వరలోనే తీరనుందనే వార్త ఒకటి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ షికారు చేస్తోంది. అయితే రాజుగా ప్రభాస్ కనిపించేది ఆయన కథానాయకుడిగా చేస్తున్న సినిమాలో కాదు .. సూర్య సినిమాలో. 

సూర్య సొంత బ్యానర్లో ఆయన హీరోగా ఒక చారిత్రక చిత్రం రూపొందుతోంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 42వ సినిమా. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమాలో మహారాజుగా ప్రభాస్ కొంతసేపు తెరపై కనిపించనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. 

Surya
Prabhas
Disha Pathani
  • Loading...

More Telugu News