Mangli: శ్రీకాళహస్తి ఆలయంలో మంగ్లీ పాటపై వివాదం
- శివరాత్రి సందర్భంగా పాట చిత్రీకరించిన మంగ్లీ
- ఆలయంలో పలు చోట్ల షూటింగ్
- గత 20 ఏళ్లుగా శ్రీకాళహస్తి ఆలయంలో చిత్రీకరణలపై నిషేధం
- మంగ్లీకి అనుమతి ఎలా ఇచ్చారంటూ విమర్శలు
ప్రముఖ గాయని మంగ్లీ శ్రీకాళహస్తి ఆలయంలో ఓ పాటను చిత్రీకరించడం దుమారం రేపుతోంది. గత 20 ఏళ్లుగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు. అలాంటిది, ఆలయంలో మంగ్లీ పాటను చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
మంగ్లీ ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ ను రికార్డు చేసి విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది ఆమె శ్రీకాళహస్తీశ్వరాలయంలో 'భం భం భోలే' పాటను షూట్ చేశారు. ఇక్కడి కాలభైరవ స్వామి ఆలయం, అమ్మవారి సన్నిధి, స్ఫటిక లింగం, రాయల మంటపం, రాహుకేతు మంటపం, ఊంజల్ సేవా మంటపం వద్ద ఈ పాట చిత్రీకరణ జరిపినట్టు తెలుస్తోంది.
ఆలయంలో షూటింగ్ జరిపేందుకు మంగ్లీకి అనుమతులు ఎలా లభించాయన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ దర్శనమిస్తోంది.