Allu Arjun: అల్లు అర్జున్ తో మరో ప్రాజెక్టు ప్లాన్ చేసిన త్రివిక్రమ్!

Allu Arjun iin Trivikram Movie

  • మహేశ్ మూవీతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టు అల్లు అర్జున్ తో 
  • ఇద్దరి కాంబినేషన్లో ఉన్న హ్యాట్రిక్ హిట్ 
  • ఈ వేసవిలో జరగనున్న పూజా కార్యక్రమాలు
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న షాహిద్ కపూర్   

ప్రస్తుతం త్రివిక్రమ్ .. మహేశ్ బాబు సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లిందనే విషయం తెలిసిందే. అయితే షూటింగు పరంగా మరింత ఆలస్యం కాకుండా త్రివిక్రమ్ పక్కా ప్లానింగ్ చేసుకునే రంగంలోకి దిగాడని అంటున్నారు.

ఈ ప్రాజెక్టు తరువాత నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండొచ్చుననేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు వచ్చాయి. ఈ మూడూ కూడా ఒకదానికి మించి మరొకటి విజయాన్ని సాధించాయి. 

ఇక 'పుష్ప'తో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది. అందువలన అల్లు అర్జున్ తో పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్ మరో ప్రాజెక్టు సెట్ చేశాడని అంటున్నారు. ఆల్రెడీ కథ వినిపించడం జరిగిపోయిందనీ, ఈ వేసవిలో పూజా కార్యక్రమాలు ఉంటాయని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో షాహిద్ కపూర్ కీలకమైన పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

Allu Arjun
Trivikram Srinivas
Shahid Kapoor
  • Loading...

More Telugu News