Nagarjuna: మలయాళ హిట్ మూవీ రీమేకులో నాగార్జున!

Nagarjuna in Malayala Remake Movie

  • 'బంగార్రాజు' తరువాత హిట్ లేని నాగ్ 
  • 'పోరింజు మరియం జోస్' సినిమాపై దృష్టి 
  • మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన మూవీ
  • జోజు జార్జ్ పాత్రను పోషించే ఆలోచనలో నాగ్

నాగార్జున కథానాయకుడిగా ఇటీవల వచ్చిన సినిమాలలో 'బంగార్రాజు' మినహా మిగతా సినిమాలేవీ అంతగా ఆడలేదు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ఈ మధ్య కాలంలో భారీ విజయాలను అందుకున్నారు. రికార్డుస్థాయి వసూళ్లను సొంతం చేసుకున్నారు. ఆ స్థాయిలో నాగ్ ప్రాజెక్టు సెట్ కాకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. 

ఈ నేపథ్యంలోనే ఒక మలయాళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మలయాళంలో జోజు జార్జ్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన ఎంచుకునే కథల్లో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంది. రాజశేఖర్ రీమేక్ చేసిన 'శేఖర్' సినిమా, అక్కడ జోజు జార్జ్ చేసిన 'జోసఫ్' నుంచి వచ్చిందే. 

అలాంటి జోజు జార్జ్ చేసిన 'పోరింజు మరియం జోస్' అనే సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన కెరియర్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచింది. జోషీ దర్శకత్వం వహించిన ఆ సినిమాకి జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఆ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కి రీమేక్ చేయడానికే నాగ్ రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు.

Nagarjuna
Joju George
Porinju Mariam Jose
  • Loading...

More Telugu News