Chiranjeevi: దసరా బరిలోను చిరూ .. బాలయ్యల మధ్య తప్పని పోటీ!

Chiranjeevi and Balayya movies update

  • సంక్రాంతి విజేతలుగా నిలిచిన చిరూ - బాలయ్య 
  • షూటింగు దశలో ఉన్న 'భోళా శంకర్'
  • సెట్స్ పైనే ఉన్న బాలయ్య తాజా సినిమా  
  • ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి
  • దసరా టార్గెట్ గా పనులు జరుపుకుంటున్న ప్రాజెక్టులు  

చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరూ సుదీర్ఘమైన కెరియర్ ను చూసినవారే. ఇద్దరూ 100 సినిమాలకి పైన చేసినవారే. ఈ ఇద్దరికీ కూడా మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉండటం మరో విశేషం. అలాంటి ఈ ఇద్దరూ ఈ సంక్రాంతికి ఒకరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అన్నదమ్ముల సెంటిమెంట్ తో ఆకట్టుకుంటే, బాలయ్య 'వీరసింహా రెడ్డి' అన్నాచెల్లెళ్ల ఎమోషన్స్ తో కట్టిపడేసింది. 

సంక్రాంతికి విడుదలైన ఈ రెండు సినిమాలు చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. రెండు సినిమాలు ఒకే బ్యానర్ లో వచ్చినప్పటికీ, అభిమానులకు సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చాయి. చిరంజీవి - బాలయ్య సినిమాలు పోటాపోటీగా బరిలోకి దిగడం చాలా అరుదు అని అంతా చెప్పుకున్నారు. కానీ దసరాకి కూడా ఇదే సీన్ రిపీట్ కానుందని తెలుస్తోంది. 

చిరంజీవి తాజా చిత్రంగా 'భోళా శంకర్' రూపొందుతోంది. మెగాస్టార్ జోడీగా తమన్నా .. ఆయన చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక బాలయ్య తాజా చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా దసరాకి విడుదల కానున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. సంక్రాంతి సీన్ దసరాకి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.

Chiranjeevi
Balakrishna
Anil Ravipudi
Bhola Shankar Movie
  • Loading...

More Telugu News