best foods: జీర్ణానికి ఈ ఆహార పదార్థాలు.. స్నేహితులు - శత్రువులు

Best and worst foods for digestion

  • పులిసిన ఆహారాలు పేగులకు మంచివి
  • పండ్లు ముడి ధాన్యాలతోనూ ప్రయోజనాలు
  • ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరలు, కృత్రిమ స్వీట్ నర్లతో నష్టం

ప్రతి ఒక్కరికీ జీవ క్రియలు వేర్వేరుగా ఉంటుంటాయి. కొందరికి సున్నితతత్వం ఉంటుంది. కొందరికి ఏమి తిన్నా చక్కగా అరిగిపోతుంది. కొందరికి అసలు ఏమీ అరగని పరిస్థితి. మనం ఏ ఆహారం తీసుకుంటున్నామనేది జీర్ణక్రియలను నిర్ణయిస్తుంది. తమ వంటి తీరు, జీర్ణ వ్యవస్థ పనితీరును బట్టి ఎవరికి వారు ఆహార, నియమాల్లో మార్పులు చేసుకోవచ్చు. 

ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మన పేగులకు ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొన్ని రకాల ఆహారాలు పేగుల్లో బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తాయి. తీసుకున్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాలేయంలో జీర్ణరసాలు విడుదల అవుతాయి. తిన్న ఆహారాన్ని ఈ జీర్ణరసాలే విచ్ఛిన్నం చేసి, సాఫీగా జీర్ణం అవ్వడానికి సాయపడతాయి. తిన్న తర్వాత కడుపులో నొప్పి, గడబిడగా అనిపించడం, త్రేన్పులు, అసౌకర్యం, కడుపుబ్బరం ఇలాంటి సమస్యలు జీర్ణ వ్యవస్థలో సమస్యలకు సంకేతాలు. ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జెర్డ్), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలిటిస్ తదితర వ్యాధులు జీర్ణ వ్యవస్థకు సంబంధించినవే. 

పులిసిన ఆహారాలు
పెరుగు, పచ్చళ్లు, ఇడ్లీ, దోశ పిండి, కించి, మిసో ఇవన్నీ పేగుల ఆరోగ్యానికి మంచివి. ఈ ఆహారాలు పులిసే క్రమంలో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఇది మన పేగుల ఆరోగ్యానికి మంచి చేస్తుంది. 

ముడి ధాన్యాలు
హోల్ వీట్, ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, క్వినోవా, పాప్ కార్న్ ఇవన్నీ కూడా ముడి ధాన్యాలకు సంబంధించినవి. వీటిల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. మంచి బ్యాక్టీరియాకు ఈ ఆహారం అవసరం. పీచుతోపాటు మంచి పోషకాలు కూడా లభిస్తాయి. పీచు ఉండడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

పండ్లు
యాపిల్, పియర్స్, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, బొప్పాయి పండ్లు పేగుల ఆరోగ్యానికి మంచివి. అధిక పీచు, విటమిన్లు, మినరల్స్ వీటిల్లో ఉంటాయి. 

టీ
పుదీనా, అల్లం, చామంతి టీలతోనూ జీర్ణానికి మేలు జరుగుతుంది. ఆహారం తీసుకున్న కొంత సమయం తర్వాత వీటిల్లో ఏదో ఒక టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవన్నది వైద్యుల సూచన.

ఫ్రైడ్ ఫుడ్స్
వేపుళ్లను తినకూడదు. వీటి వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు హాని జరుగుతుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్
ప్రాసెస్డ్ ఫుడ్స్ లో చక్కెరలు, ఉప్పులు ఎక్కువగా ఉంటాయి. పీచు ఉండకపోవడం, ఉన్నా చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. పైగా వీటిల్లో ప్రిజర్వేటివ్ లు ఉంటాయి. ఇవి మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలకు కారణమవుతాయి.

కృత్రిమ స్వీట్ నర్లు
కడుపులో నొప్పి, విరేచనాలకు కృత్రిమ చక్కెరలు కారణమవుతాయి. 

ఆల్కహాల్
ఆల్కహాల్ యాసిడ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణ ప్రక్రియకు అవరోధం కలిగిస్తుంది. 

పప్పులు, చిక్కుళ్లు
ఇవి కొన్ని సందర్భాల్లో జీర్ణ పరమైన అసౌకర్యానికి కారణమవుతాయి. అందుకే వీటిని నానబెట్టి ప్రెషర్ కుక్కర్ లో వండుకుని తినడం వల్ల మంచి జరుగుతుంది.

best foods
worst foods
healthy foods
gut health
  • Loading...

More Telugu News