Mahesh Babu: మహేశ్ బాబు సరసన మూడో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ?

Bhumi Pednekar in Trivikram Movie

  • 28వ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లిన మహేశ్ 
  • కథానాయికగా అలరించనున్న పూజ హెగ్డే 
  • రెండో నాయికగా ఆకట్టుకోనున్న శ్రీలీల
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న భూమి పెడ్నేకర్

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో, ఇక్కడి సినిమాల్లో చేయడానికి బాలీవుడ్ భామలు పోటీపడుతున్నారు. అలియా భట్ .. కియారా అద్వాని .. అనన్య పాండే వంటివారు ఆల్రెడీ తెలుగు సినిమాలు చేసేయగా, త్వరలోనే ఆ జాబితాలో దీపికా పదుకొణె కూడా చేరనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భూమి పెడ్నేకర్ పేరు వినిపిస్తోంది. 

భూమి పెడ్నేకర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. 2015లోనే ఆమె బాలీవుడ్ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి రొటీన్ కి భిన్నంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. తాజాగా మహేశ్ బాబు మూవీ కోసం త్రివిక్రమ్ ఆమెను ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. మహేశ్ బాబు 28వ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఈ సినిమాలో మొదటి కథనాయికగా పూజ హెగ్డేను .. రెండో నాయికగా శ్రీలీలను తీసుకున్నారు. మూడో నాయికగా భూమి పెడ్నేకర్ ను ఎంచుకున్నారు. ఆమె పాత్ర సెకండాఫ్ లో ఉంటుందనీ .. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందని అంటున్నారు. 

Mahesh Babu
Pooja Hegde
Sreeleela
Bhumi Pednekar
  • Loading...

More Telugu News