Chandrababu: గన్నవరం ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన చంద్రబాబు

Chandrababu condemns Gannavaram incident

  • గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి
  • కారుకు నిప్పంటించిన వైనం
  • జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్న చంద్రబాబు
  • పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని ఆగ్రహం

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, కారుకు నిప్పు పెట్టిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగులబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చుతున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. 

"రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Chandrababu
TDP Office
Gannavaram
YSRCP
Vallabhaneni Vamsi

More Telugu News