Team India: మహిళల టీ20 వరల్డ్ కప్: ఐర్లాండ్ తో టీమిండియా కీలక మ్యాచ్

Team India eves plays against Ireland in a crucial match
  • దక్షిణాఫ్రికా గడ్డపై మహిళల టీ20 వరల్డ్ కప్
  • ఐర్లాండ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ చేరిక
  • పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న భారత్
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు గ్రూప్-బి లో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా అమ్మాయిలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా సెమీస్ చేరుతుంది. ఓడిపోతే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంటుంది. 

గ్రూప్- బి లో ఇప్పటివరకు తానాడిన మూడు మ్యాచ్ ల్లో భారత్ రెండు విజయాలు సాధించింది. పాకిస్థాన్, వెస్టిండీస్ లను ఓడించిన భారత్... ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్... ఇంగ్లండ్ తర్వాత రెండోస్థానంలో ఉంది.
Team India
Ireland
T20 World Cup
Women

More Telugu News