Andrea: ఉత్కంఠను రేపుతున్న 'నో ఎంట్రీ' ట్రైలర్!

No Entry Trailer Released

  • ఆండ్రియా ప్రధానమైన పాత్రగా 'నో ఎంట్రీ'
  • తమిళ సినిమాకి ఇది తెలుగు అనువాదం 
  • అడవి కుక్కల నేపథ్యంలో నడిచే కథ
  • దర్శకత్వం వహించిన అలుగు కార్తీక్

కోలీవుడ్లో ఆండ్రియాకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ .. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను చేయడానికి ఆమె ఆసక్తిని చూపుతూ వచ్చింది. తమిళంలో ఆమె చేసిన ఒక సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'నో ఎంట్రీ'.

శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి అలుగు కార్తీక్ దర్శకత్వం వహించాడు. అజేశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఫారెస్టు నేపథ్యంలో .. అడవి కుక్కలకి సంబంధించిన కథ అనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది. 

"ఒక సైంటిస్ట్ అడవి కుక్కలపై రీసెర్చ్ చేస్తాడు .. అవి కరిచిన కొద్ది సేపటికే మనుషులకు వాటి లక్షణాలు వస్తుంటాయి. ఆ ఫారెస్టుకి వెళ్లిన సైంటిస్ట్ అదృశ్యం కావడంతో, అతని ఆచూకీ తెలుసుకోవడం కోసం అతని కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళుతుంది. అక్కడ చిక్కుబడిన ఆ టీమ్ ఎలా బయటపడిందనేదే కథ.

More Telugu News