Malladi Vishnu: కన్నా దెబ్బకు సోము వీర్రాజుకు మతిపోయింది... ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థంకావడంలేదు: మల్లాది విష్ణు

Malladi Vishnu fires on BJP leaders

  • శివరాత్రి రోజున జగన్ బొమ్మతో ట్వీట్ చేసిన వైసీపీ
  • హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలంటున్న బీజేపీ నేతలు
  • ఆ ట్వీట్ కు విపరీతార్థాలు తీయొద్దన్న మల్లాది విష్ణు
  • సోము వీర్రాజును గాడిదతో పోల్చిన వైనం

శివరాత్రి రోజున వైసీపీ చేసిన ఓ ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. తెలుగులో చేసిన ట్వీట్ కు విపరీతార్థాలు తీయొద్దని హితవు పలికారు. అసలు, ఆ ట్వీట్ పై వ్యాఖ్యానించే అర్హత బీజేపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. 

కన్నా దెబ్బకు సోము వీర్రాజుకు మతిపోయినట్టుందని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. అంతేకాదు, సోము వీర్రాజును గాడిదతో పోల్చారు. సోము వీర్రాజును అనడానికి గాడిద అనే పదం కంటే దిగజారుడు పదం ఇంకేమైనా ఉందా? అని వ్యాఖ్యానించారు. 

"ఆలయాలు కూల్చివేసింది మీరు... మీరు కూల్చివేసిన ఆలయాలను ఓ పద్ధతిలో మేం పునర్ నిర్మిస్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేసే బీజేపీ నేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారు" అంటూ మల్లాది విష్ణు స్పష్టం చేశారు.

Malladi Vishnu
YSRCP
Jagan
Somu Veerraju
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News