Jr NTR: తారకరత్న మరణం: ఎన్టీఆర్- కొరటాల సినిమా లాంచింగ్ వాయిదా!

ntr 30 launching ceremony postponed

  • ఫిబ్రవరి 24న ‘ఎన్టీఆర్ 30’ని లాంచ్ చేస్తామని గతంలో ప్రకటించిన మేకర్స్
  • తారకరత్న మృతి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు వెల్లడి
  • కొత్త తేదీని సరైన సమయంలో తెలియజేస్తామని ప్రకటన

నందమూరి తారకరత్న మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే తారకరత్న అకాల మరణం చెందడంతో నందమూరి కుటుంబం తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా వాయిదా పడింది. 

ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందే సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 24న లాంచ్ కావాల్సి ఉంది. అయితే తారకరత్న మరణంతో సినిమా ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. సినిమా లాంచింగ్‌ కొత్త తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. 

ఎన్టీఆర్‌ 30 మూవీని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రత్నవేల్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. గతంలో తారక్, కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Jr NTR
Koratala Siva
NTR30
Tollywood
postpone

More Telugu News