Posani Krishna Murali: ఒక ఫ్యామిలీ నన్ను తొక్కేయాలని చూసింది: పోసాని

Posani Interview

  • రైటర్ గా ఇండస్ట్రీకి వచ్చిన పోసాని 
  • తన పెళ్లి గురించిన ప్రస్తావన   
  • మంచి చదువు వలన సంబంధాలు వచ్చాయని వెల్లడి
  • పెళ్లి కుదరకుండా చేయాలని కొంతమంది చూశారని వ్యాఖ్య
  • వాళ్ల కోసం కత్తి కూడా కొన్నానని వివరణ

పోసాని కృష్ణమురళి ఎన్నో కష్టాలు పడుతూ, అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. పవర్ఫుల్ డైలాగులు రాయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇక దర్శకుడిగా కూడా ఆయన తన దారి విభిన్నం అనే విషయాన్ని చాటి చెప్పారు. నటుడిగా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన, కామెడీ టచ్ ఉన్న విలన్ రోల్స్ చేయడంలో ఎక్కువ మార్కులు కొట్టేశారు.

తాజా ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ తన గతాన్ని గురించి ప్రస్తావించారు. "నేను బాగా చదువుకున్నాను .. రేపో .. మాపో మంచి జాబ్ వస్తుందనే ఉద్దేశంతోనే నాకు పిల్లను ఇవ్వడానికి కొంతమంది ముందుకొచ్చారు. రైటర్ గా అవకాశాలు లేకపోయినా బ్రతకగలడు అనే భరోసాతోనే నాకు పిల్లను ఇవ్వడానికి వచ్చారు. నేను పద్ధతిగా ఉండేవాడిని .. ఎవరినీ ఒక్క కామెంట్ కూడా చేసేవాడిని కాదు" అన్నారు. 

"అలా నాకు వచ్చిన సంబంధాలను ఒక ఫ్యామిలీ నా గురించి చెడుగా చెబుతూ పెళ్లి కుదరనీయలేదు. వాళ్లు నా గురించి బయట చెప్పే మాటలు ఏమిటనేది నాకు తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక దశలో మాత్రం ఇక ఓపిక నశించి కత్తి కొని పుస్తకంలో పెట్టుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Posani Krishna Murali
Actor
Tollywood
  • Loading...

More Telugu News