Virat Kohli: ఆ ఒక్కటి మాత్రం ఎప్పటికీ తినను: కోహ్లీ

Virat Kohli Reveals The One Food Item He Will Never Eat

  • మలేసియాలో ఓ రకమైన కీటకపు వంటను రుచి చూశానన్న కోహ్లీ
  • తాను ప్రస్తుతం శాకాహారుడినని వెల్లడి 
  • కాకరకాయను మాత్రం ఎప్పటికీ తినబోనని వ్యాఖ్య

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు మంచి భోజన ప్రియుడు. కానీ తన ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు జంక్ ఫుడ్ కు దూరమయ్యాడు. కావాల్సినంత మేరకే తింటూ ఫిట్ గా ఉంటున్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా.. తనకు ఇష్టమైన ఆహారం వచ్చినప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘చొల్లే కుల్చే’ అనే ఐటమ్.. తనకు ఇష్టమైన ఆహారమని కోహ్లీ చెప్పాడు. అయితే తాను ఎన్నటికీ తిననిది ఏంటో కూడా చెప్పేశాడు.  అతడితో నెటిజన్లు కూడా ఏకీభవించడం గమనార్హం. ఇంతకీ ఆ ఐటమ్ ఏంటంటే.. కాకరకాయ. 

ఇన్ స్టా గ్రామ్ లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. అందులో ప్రస్తుతం తాను వెజిటేరియన్ ను అని చెప్పాడు. అయితే కాకరకాయను మాత్రం ఎన్నటికీ తిననని తెలిపాడు. 

గతంలో తాను తిన్న విచిత్ర వంటకాన్ని గురించి వివరించాడు. ‘‘మలేసియాలో ఓ రకమైన కీటకపు వంటను రుచి చూసినట్లు గుర్తు. అయితే అదేంటో నాకు తెలియదు. దాన్ని ఫ్రై చేశారు. తిన్నాను కానీ, అసహ్యమేసింది’’ అని చెప్పాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Virat Kohli
One Food Item kohli Will Never Eat
Instagram
karela
kakarakaya
  • Loading...

More Telugu News