RRR: ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరో రెండు విదేశీ అవార్డులు

Two more awards for RRR

  • అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ కు గుర్తింపు
  • ఇప్పటికే పలు అవార్డులు కైవసం
  • ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట
  • తాజాగా హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డులు

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం విశేషంగా గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రపంచస్థాయి అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్... ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులోనూ నిలిచింది. 

తాజాగా, మరో రెండు విదేశీ అవార్డులు కూడా ఆర్ఆర్ఆర్ ను వరించాయి. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీని కూడా ఆకట్టుకుంది. 

ఈ నేపథ్యంలో, ఇప్పుడందరి దృష్టి మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంపైనే ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ ఖాయమని చిత్రబృందంతో పాటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RRR
Awards
Houston Film Critics Society
USA
Rajamouli
Ram Charan
Junior NTR
Tollywood
  • Loading...

More Telugu News