Madhya Pradesh: పెళ్లిలో పెద్ద సౌండ్‌తో డీజే.. వధూవరులకు షాకిచ్చిన మతపెద్ద..
- పెళ్లిలో పెద్ద శబ్దంతో డీజే పెట్టడంపై మతపెద్ద అభ్యంతరం
- వివాహం జరిపించేది లేదంటూ గుస్సా
- వధూవరుల కుటుంబసభ్యులు క్షమాపణలు చెప్పడంతో శాంతించిన మతపెద్ద
పెళ్లిలో పెద్ద సౌండ్‌తో డీజే పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ మతపెద్ద పెళ్లి జరిపించేది లేదంటూ వధూవరులకు షాకిచ్చారు. మధ్యప్రదేశ్ ఛతార్‌పూర్ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వధూవరుల కుటుంబ సభ్యులు చివరకు క్షమాపణలు చెప్పడంతో ఆ మతపెద్ద శాంతించి వివాహం జరిపించారు.
డీజే పెడితే తప్పేంటని ప్రశ్నించగా..పెళ్లిళ్లలో అనవసర ఖర్చులు పెట్టకూడదన్న నియమం తమకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘సమాజంలో అందరూ ఒక్కటే అన్న సందేశం అందరికీ తెలిసేలా..మా సంప్రదాయంలో డీజే పాటలు, డ్యాన్సులపై నిషేధం ఉంది. ఈ విషయంలో మా వర్గం వారందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.