YS Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్

YSRTP Chief YS Sharmila Arrested

  • మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై అవినీతి ఆరోపణలు చేసిన షర్మిల
  • బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
  • షర్మిలను హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. మహబూబాబాద్‌లో నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం షర్మిలను అరెస్ట్ చేశారు.

YS Sharmila
YSRTP
Mahabubabad District
Banoth Shankar Naik
  • Loading...

More Telugu News