Nandamuri Tarakaratna: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతిక కాయం

Nandmuri Tarakaratna Dead Body Reached Hyderabad

  • అంబులెన్స్‌లో హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్థివదేహం
  • కడసారి చూసేందుకు తరలివస్తున్న కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు
  • రేపు సాయంత్రం అంత్యక్రియలు

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూసిన సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది. బెంగళూరు నుంచి గత రాత్రి అంబులెన్స్‌లో బయలుదేరిన ఆయన భౌతికకాయం రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి చేరుకుంది. తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. 

రేపు ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తరలించి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Nandamuri Tarakaratna
Nandamuri Family
Tollywood
Mohan Krishna
Balakrishna
  • Loading...

More Telugu News