Tarakaratna: తారకరత్న మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు
![Tollywood deeply saddened for Tarakaratna untimely demise](https://imgd.ap7am.com/thumbnail/cr-20230218tn63f11741b56cd.jpg)
- 40 ఏళ్ల వయసుకే ఈ లోకాన్ని వీడిన తారకరత్న
- తీవ్ర గుండెపోటుకు చికిత్స పొందుతూ కన్నుమూత
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహేశ్ బాబు
- గుండె పగిలినంత పనైందన్న అల్లు అర్జున్
నందమూరి తారకరత్న (40) తీవ్ర గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తారకరత్న మృతితో టాలీవుడ్ లో విషాదం అలముకుంది. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, తారకరత్న ఇక లేరన్న వార్త తెలిసి గుండె పగిలినంత పనైందని తెలిపారు. తారకరత్న చిన్న వయసులోనే లోకాన్ని వీడారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
దిగ్భ్రాంతికి గురైన మహేశ్ బాబు