G Jagadish Reddy: కేంద్ర ప్రభుత్వ ఈఆర్సీ నిర్ణయంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం

Jagadish Reddy fires on ERC decision

  • ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహం
  • అదానీకి లాభం చేకూర్చేందుకే ఈ నిర్ణయమని వ్యాఖ్య 
  • కేంద్రం తెచ్చేవి నల్ల చట్టాలు అని విమర్శలు

కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈఆర్సీ నిర్ణయంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అదానీకి లాభం చేకూర్చేందుకే కేంద్రం ఈఆర్సీ నిర్ణయం తీసుకుందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కాదు, నల్ల విద్యుత్ చట్టాలు అని విమర్శించారు. సంస్కరణల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ప్రజాధనం దోచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. అదానీకి మేలు చేయడమే కేంద్రం లక్ష్యమని అన్నారు.

G Jagadish Reddy
ERC
Electricity
BRS
Union Govt
Telangana
  • Loading...

More Telugu News