Tillu Square: డీజే టిల్లు 2 నుంచి అనుపమ ఫస్ట్ లుక్

dj tillu 2 makers released anupama parameswaran first look

  • అనుపమ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
  • నోస్‌ పిన్‌ పెట్టుకుని ‘రాధిక’ను గుర్తు చేసేలా అనుపమ
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘టిల్లు స్క్వేర్’

చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా డీజే టిల్లు. హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ ఆటిట్యూడ్, డైలాగ్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది.

రెండో పార్ట్ లో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. దీంతో మేకర్స్ అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ నోస్‌ పిన్‌ పెట్టుకుని అందంగా కనిపించి ఆకట్టుకుంటోంది. తొలిభాగంలోని ‘రాధిక’ను గుర్తుచేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతకుముందు సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన చిన్న వీడియో కూడా విశేషంగా ఆకట్టుకుంది. తొలి పార్ట్ నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. డీజే టిల్లు స్క్వేర్ కూడా తీస్తోంది.

More Telugu News