Chelluboyina Venugopala Krishna: చంద్రబాబు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

Minister Venugopalakrishna slams Chandrababu

  • నిన్న అనపర్తిలో చంద్రబాబు పర్యటన
  • తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన వైనం
  • చంద్రబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న మంత్రి చెల్లుబోయిన
  • చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారని విమర్శలు

నిన్న అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలు సృష్టించడంపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబేనని విమర్శించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఒక రాజ్యానికి రాజులా నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. 

చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులతో చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విపక్షనేత చర్యలు రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని అన్నారు. మతిస్థిమితం కోల్పోయిన చంద్రబాబు ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన పేర్కొన్నారు. అందుకే ఆయనను ప్రజలు కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. 

చంద్రబాబు విజనరీ కాదని, విజన్ లేని వ్యక్తి అని వ్యంగ్యం ప్రదర్శించారు. విపక్షాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Chelluboyina Venugopala Krishna
Chandrababu
Anaparthi
YSRCP
TDP
  • Loading...

More Telugu News