Himanshu: కవర్ సాంగ్ చేసిన హిమాన్షు... మురిసిపోయిన కేటీఆర్

KTR excited for his son Himanshu

  • వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న కేటీఆర్ తనయుడు
  • జేవీకేఈ గోల్డెన్ అవర్ సాంగ్ కు కవర్ సాంగ్ చేసిన వైనం
  • తన యూట్యూబ్ చానల్లో రిలీజ్ చేసిన హిమాన్షు
  • ఎంతో గర్విస్తున్నానన్న కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు వివిధ రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. సామాజిక సేవపై అత్యంత ఆసక్తి కనబరిచే హిమాన్షు ఆ రంగంలో పలు అవార్డులు కూడా అందుకున్నారు. తాజాగా హిమాన్షు ఓ పాప్ గీతానికి కవర్ సాంగ్ చేశారు. అమెరికన్ సింగ్ జేవీకేఈ రూపొందించిన గోల్డెన్ అవర్ సాంగ్ కు హిమాన్షు కవర్ సాంగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో పంచుకున్నారు. ఇదే నా తొలి కవర్ సాంగ్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

తనయుడి కవర్ సాంగ్ పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వెలిబుచ్చారు. నా బిడ్డ ఘనత పట్ల ఉద్విగ్నతకు లోనయ్యానని, ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. ఈ వీడియోను ఎంతగానో ఆస్వాదించానని కేటీఆర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Himanshu
Cover Song
Golden Hour
JVKE
KTR
BRS
KCR
Telangana

More Telugu News