Chandrababu: చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనపర్తి దేవీ చౌక్ సెంటర్ లో ఉద్రిక్తత

Tension in Anaparthi Devi Chowk amid Chandrababu tour

  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి
  • జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • అనపర్తిలో పోలీసు బ్యారికేడ్లు
  • తోసుకుని వచ్చిన టీడీపీ శ్రేణులు
  • పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు. ఇవాళ అనపర్తిలో ఆయన పర్యటించాల్సి ఉండగా, స్థానిక దేవీ చౌక్ సెంటర్ లో ఉద్రిక్తత ఏర్పడింది. 

చంద్రబాబు రాకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అనపర్తిలోని దేవీ చౌక్ సెంటర్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. బారికేడ్లు తోసుకుని దేవీ చౌక్ సెంటర్ కు వెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాసేపట్లో చంద్రబాబు అనపర్తి దేవీ చౌక్ సెంటర్ కు రావాల్సి ఉంది.

Chandrababu
Anaparthi
Devi Chowk
TDP
Police
  • Loading...

More Telugu News