Earthquake: జమ్మూ కశ్మీర్ లో భూకంపం

Earthquake hits Jammu Kashmirs Katra

  • కత్రాలో తెల్లవారుజామున కంపించిన భూమి
  • రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదు
  • ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్న అధికారులు

టర్కీ, సిరియాలో భూకంపాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోకముందే భారత్ లో జమ్మూ కశ్మీర్‌లో భూకంపం భారత్ లో ఆందోళన రేకెత్తించింది. జమ్మూ కశ్మీర్ లోని కత్రాలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5.01 గంటలకు 10 కి.మీ లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. భూకంప కేంద్రం కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా, ఈనెల 13న సిక్కిం రాష్ట్రంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం సిక్కింలోని యుక్సోమ్‌లో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది.

Earthquake
Jammu And Kashmir
Katra

More Telugu News