Swara Bhaskar: లవ్ మ్యారేజి చేసుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్

Swara Bhaskar weds politician

  • సినిమాలతోనే కాదు, తన వ్యాఖ్యలతోనూ గుర్తింపు తెచ్చుకున్న స్వరా
  • రాజకీయనేతను పెళ్లాడిన వైనం
  • ఓ వీడియో ద్వారా వెల్లడించిన స్వరా

సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవడమే కాకుండా, సామాజిక అంశాలపై గళం విప్పుతూ ప్రజల్లో ఆలోచన కలిగించే నటి స్వరా భాస్కర్. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు పొందారు. తాజాగా ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.

స్వరా భాస్కర్ ప్రేమించి పెళ్లాడింది ఓ రాజకీయనేతను కావడం విశేషం. అతడి పేరు ఫహద్ అహ్మద్. సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం యూత్ ప్రెసిడెంట్ కాగా, తన పెళ్లి విషయాన్ని స్వరా భాస్కర్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. జనవరి 6న తాము ముంబయిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. తాము స్నేహితులుగా ప్రస్థానం ప్రారంభించి, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడ్డామని ఆమె వివరించారు.

Swara Bhaskar
Fhad Mohammad
Marriage
Bollywood
  • Loading...

More Telugu News