Upasana: ఒకరు నిజమైన కుమార్తె... మరొకరు దత్తపుత్రిక: సద్గురుతో ఉపాసన

Upasana with Sadguru and his daughter

  • ఫిబ్రవరి 5న అపోలో ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు
  • కుమార్తె రాధే జగ్గీతో కలిసి హాజరైన సద్గురు
  • వారిద్దరితో కలిసి ఉపాసన ఫొటో
  • తన కుమార్తెలతో సద్గురు అంటూ క్యాప్షన్

ఇటీవల ఫిబ్రవరి 5న అపోలో ప్రతాప్ సి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధునిక ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా విచ్చేశారు. ఆయన కుమార్తె రాధే జగ్గీ కూడా ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా, అపోలో ప్రతాప్ రెడ్డి మనవరాలు, టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన.... సద్గురుతో ఫొటో దిగారు. ఆ ఫొటోలో సద్గురుకు ఒకవైపున రాధే జగ్గీ, మరోవైపున ఉపాసన ఉన్నారు. ఈ ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"తన కుమార్తెలతో సద్గురు" అని ఉపాసన క్యాప్షన్ పెట్టారు. "ఒకరు నిజమైన కూతురు, మరొకరు దత్తపుత్రిక" అంటూ వివరణ ఇచ్చారు. సద్గురు సమక్షంలో ఉండడాన్ని ఎల్లప్పుడూ సంతోషదాయకంగా భావిస్తానని తెలిపారు. 

"తాత పుట్టినరోజు వేడుకలకు వచ్చినందుకు కృతజ్ఞతలు... నా నుంచి రాధే జగ్గీకి ఆత్మీయ ఆలింగనం" అంటూ ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Upasana
Sadguru
Radhe Jaggi
Prathap C Reddy
Birthday
Apollo
Hyderabad
  • Loading...

More Telugu News