Balakrishna: రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య?

Balakrishan increased remuneration

  • వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య
  • రూ. 70 కోట్ల వరకు జరుగుతున్న థియేట్రికల్ బిజినెస్
  • రూ. 20 కోట్లకు రెమ్యునరేషన్ పెంచారంటూ వార్తలు

ఇటీవలి కాలంలో సినీ హీరోలు తమ రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ పోతున్నారు. కరోనా తర్వాత వసూళ్లు కూడా పెరుగుతుండటంతో వారికి ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నారు. దీంతో, ఆయన కూడా పారితోషికాన్ని కొంత పెంచినట్టు ఫిలిం నగర్ టాక్. 

తన రెమ్యునరేషన్ ను బాలయ్య రూ. 20 కోట్లు చేసినట్టు చెపుతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న చిత్రానికి ఇదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బాలయ్య రెమ్యునరేషన్ కు సంబంధించిన చర్చ ఎప్పుడూ రాదు. కొన్నేళ్లకు ఒకసారి ఆయన పారితోషికాన్ని పెంచుతారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలు రూ. 70 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాయి. దీనికి తోడు ఓటీటీ, టీవీ, డిజిటల్ హక్కుల విషయంలో కూడా డిమాండ్ భారీగా ఉంది. దీంతో, ఆయన రెమ్యునరేషన్ పెంచినట్టు చెపుతున్నారు.

Balakrishna
Tollywood
Remuneration
  • Loading...

More Telugu News