Adi Saikumar: జీ 5 వెబ్ సిరీస్ గా 'పులి మేక' .. చరణ్ చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజ్!

Puli Meka Web series update

  • జీ 5 నుంచి 'పులి - మేక' వెబ్ సిరీస్ 
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే సీరియల్ కిల్లర్ కథ 
  • లీడ్ రోల్స్ లో ఆది సాయికుమార్ - లావణ్య త్రిపాఠి
  • ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్

జీ 5 వారు చాలా వేగంగా వివిధ జోనర్స్ లో రూపొందిన వెబ్ సిరీస్ లను డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పైకి తీసుకుని వస్తున్నారు. ఇంతకుముందు 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' .. ' గాలివాన' వంటి హిట్ వెబ్ సిరీస్ ను అందించిన జీ 5వారు, థ్రిల్లర్ జోనర్లో 'పులి - మేక' అనే మరో వెబ్ సిరీస్ ను తమ ఫ్లాట్ ఫామ్ ద్వారా అందించడానికి రెడీ అవుతున్నారు. 

ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్టు గ్లింప్స్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహిచిన ఈ వెబ్ సిరీస్ కి కోన వెంకట్ కథను అందించడమే కాకుండా, తన సొంత బ్యానర్లో నిర్మించారు.  

పోలీస్ డిపార్టుమెంటు వారినే టార్గెట్ గా చేసుకుని వరుస హత్యలు చేసే ఒక సీరియల్ కిల్లర్ కథ ఇది. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ లో ఆది సాయికుమార్ - లావణ్య త్రిపాఠి ప్రధానమైన పాత్రలను పోషించారు. సిరి .. ముక్కు అవినాశ్ .. రాజా చేంబోలు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది..

Adi Saikumar
lavanya Tripathi
Mukku Avinash
Puli Meka Webseries
  • Loading...

More Telugu News