Venkatesh Daggubati: పాములాంటి వాడికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు: ఆసక్తిని రేపుతున్న 'రానా నాయుడు' ట్రైలర్!

Rana Nayudu Trailer Relesed

  • వెంకీ ఫస్టు వెబ్ సిరీస్ గా 'రానా నాయుడు'
  • ఆయన తనయుడి పాత్రలో కనిపించిన రానా 
  • క్రైమ్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ 
  • తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఘర్షణ ప్రధానమైన కథాంశం 
  • మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

టాలీవుడ్ లోని సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేశ్ స్థానం ప్రత్యేకం. ఎలాంటి ప్రయోగాన్ని చేయడానికైనా ఆయన వెనుకాడరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ట్రెండ్ కి తగినట్టుగా ఓ వెబ్ సిరీస్ కూడా చేశారు .. అదే 'రానా నాయుడు'. నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ఈ వెబ్ సిరీస్ లో ఆయన రానాకి తండ్రిగా చేయడం .. ఇంతవరకూ తెరపై కనిపించదానికి భిన్నంగా ఒక డిఫరెంట్ లుక్ తో ఆయన కనిపించడం ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి పెరగడానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది. 

నిన్న ఈ వెబ్ సిరీస్ నుంచి తెలుగు ట్రైలర్ ను వదిలారు.  ముంబై నేపథ్యంలో నడిచే కథ ఇది. ఏ సెలబ్రిటీ ఆపదలో ఉన్నా అందరికంటే ముందుగా రానాకీ కాల్ వస్తుంది. వెంటనే రంగంలోకి దిగిపోయే పాత్రలో ఆయన కనిపిస్తున్నాడు. డబ్బు .. మాదక ద్రవ్యాలు .. రొమాన్స్ .. యాక్షన్ ఆయన జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తున్నాయి. తండ్రి జైలు నుంచి రిలీజ్ అయితే, ఇంకో ఐదేళ్లు జైల్లోనే ఉంటే బాగుండేదని కోరుకునే కొడుకుగా ఆయన పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంది.'వాడొక పాము .. ఒక్క అవకాశం ఇచ్చినా నా ఫ్యామిలీని నాశనం చేస్తాడు' అనే రానా డైలాగ్ మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.   
 

"నా జీవితంలో చెడు చేసినా .. మంచి చేసినా అది నా ఫ్యామిలీ కోసమే చేశాను. కాకపోతే కలిసున్నది తక్కువ .. విడిపోయింది ఎక్కువ" అనే వెంకీ డైలాగ్ తో ఆయన పాత్రలోని సంఘర్షణ అర్థమవుతోంది. ముంబై నేపథ్యంలో ఒక వైపున కార్పొరేట్ అరాచకాలు .. మరో వైపున తండ్రీ కొడుకుల మధ్య జరిగే పోరాటంగా ఈ కథ కనిపిస్తోంది. సుందర్ ఆరోన్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించాడు. మార్చి 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Venkatesh Daggubati
Rana Daggubati
Rana Nayudu
WebSeries

More Telugu News