Type-2 Diabetes: శనగపిండితో డయాబెటిస్‌కు కళ్లెం.. తేల్చేసిన పరిశోధకులు

Gram flour Decrees Diabetes Risk

  • శనగపిండితో మధుమేహం నుంచి రక్షణ
  • శనగపిండిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపు నిండిన భావన
  • అధిక బరువు నుంచీ రక్షణ లభిస్తుందంటున్న పరిశోధకులు

ఆహారంలో మీరు శనగపిండి ఎక్కువగా వాడుతున్నారా? అయితే, డయాబెటిస్ నుంచి మీకు రక్షణ లభిస్తున్నట్టే! పరిశోధకులు చెప్పినమాట ఇది. గోధుమపిండి స్థానంలో శనగపిండిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని, రక్తంలో ఇన్సులిన్, టైప్-2 డయాబెటిస్ బారినపడకుండా తప్పించుకోవచ్చని తాజా పరిశోధనలో రుజువైంది. 

అధిక బరువుతో పాటు టైప్-2 డయాబెటిస్ బారినపడకుండా కూడా శనగపిండి రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు తెలిపారు. 30 శాతం కొమ్ము శనగపిండి కలిపి గోధుమ పిండితో తయారుచేసిన రొట్టె తింటే.. సాధారణ రొట్టె తినడంతో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయులు 40 శాతం తగ్గినట్టు గుర్తించారు. ఇందులో ఉండే పిండిపదార్థం అరుగుదల స్థాయిని నెమ్మదింపచేయడమే అందుకు కారణమని పరిశోధనలో తేలింది.

Type-2 Diabetes
Obesity
Diabetes
Gram Flour
  • Loading...

More Telugu News