Dhanush: పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేక కష్టాలు పడ్డాను: 'సార్' ఈవెంటులో సాయికుమార్

Sir Pre Release Event

  • ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్' 
  • ముఖ్యమైన పాత్రను పోషించిన సాయికుమార్ 
  • చదువుకోవడానికి కష్టాలు పడ్డానని వెల్లడి 
  • మాస్టార్లు .. స్టూడెంట్స్ తప్పక చూడాల్సిన సినిమా అని వ్యాఖ్య    

ధనుశ్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమా రూపొందింది. తెలుగులో 'సార్' టైటిల్ తోను .. తమిళంలో 'వాతి' టైటిల్ తోను ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటును, హైదరాబాదు .. నెక్ లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో నిర్వహించారు.

త్రివిక్రమ్ .. తమన్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ .. "నేను కష్టాల్లో పుట్టాను .. కష్టాల్లో పెరిగాను. నేను చదువుకునే రోజుల్లో పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితులను చూడటం వల్లనే ఈ కథకి కనెక్ట్ అయ్యాను" అన్నారు. 

"ధనుశ్ చాలా గొప్ప ఆర్టిస్ట్ .. షాట్ రెడీ అనగానే తనలోని నటుడు బయటికి వస్తాడు. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో కథాకథనాలు .. డైలాగ్స్ .. పాటలు .. ఫైట్లు అన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ .. యూత్ తో పాటు, గురువులు .. స్టూడెంట్స్ తప్పక చూడవలసిన సినిమా ఇది" అని చెప్పుకొచ్చారు.

Dhanush
Samyuktha Menon
Sir Movie
Trivikram Srinivas
  • Loading...

More Telugu News