Santosh Sobhan: ఇది నా ఫస్టు మూవీ .. నాన్న ఆశీస్సులు ఉన్నాయి: సుస్మిత కొణిదెల

Sridevi Sobhan Babu pre release event

  • విలేజ్ నేపథ్యంలో నడిచే 'శ్రీదేవి శోభన్ బాబు'
  • నిర్మాతగా వ్యవహరించిన సుస్మిత కొణిదెల 
  • షూటింగు చాలా సరదాగా సాగిందని వెల్లడి 
  • తప్పకుండా కనెక్ట్ అవుతుందని చెప్పిన సుస్మిత

విలేజ్ నేపథ్యంలో రూపొందిన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా, ఈ నెల 18వ తేదీన థియేటర్లకు రానుంది. సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ జంటగా నటించిన ఈ సినిమాకి, సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా సింపుల్ గా నిర్వహించారు. 

ఈ వేదికపై సుస్మిత మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ .. లవ్ కి సంబంధించిన ఎమోషన్స్ చాలా నేచురల్ గా అనిపిస్తూ కనెక్ట్ అవుతాయి. దర్శకుడు ప్రశాంత్ చాలా కష్టపడి తాను అనుకున్న అవుట్ పుట్ తీసుకొచ్చాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది .. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

"ఈ సినిమా షూటింగు చాలా సరదాగా సాగిపోయింది. అందరూ కూడా చాలా అంకితభావంతో పనిచేశారు. ఇంతకుముందు మా బ్యానర్ పై వెబ్ సిరీస్ లు చేశాము .. ఇది మాకు ఫస్టు మూవీ. నాన్న ఆశీస్సులు ఉన్నాయి. అలాగే మీ అభిమానం .. ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నాను" అంటూ ముగించారు. 

Santosh Sobhan
Gowry Kishan
Sridevi Sobhan Babu
  • Loading...

More Telugu News