Santosh Sobhan: సుస్మిత మెగా ప్రొడ్యూసర్ కాబోతోంది: నాగబాబు

Sridevi Sobhan Babu pre release event

  • సుస్మిత నిర్మాతగా 'శ్రీదేవి శోభన్ బాబు'
  • ఆమె స్టార్ హీరోలతో చేయగలదన్న నాగబాబు 
  • నిదానంగా ఎదగడం కోసమే ఈ ప్రయత్నమని వెల్లడి 
  • దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉందని వ్యాఖ్య   

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా నిర్మితమైంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ నటించారు. ఈ నెల 18వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను నాగబాబు పోషించారు. 

నాగబాబు మాట్లాడుతూ .. "సుస్మిత తలచుకుంటే స్టార్ హీరోలతోనే సినిమాలు చేయవచ్చు. కానీ ఒక సాధారణమైన నిర్మాతగానే లోటుపాట్లు తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. వెబ్ సిరీస్ ల దగ్గర నుంచి సినిమాల నిర్మాణం వరకూ వచ్చింది. త్వరలోనే ఆమె మెగా ప్రొడ్యూసర్ గా మారనుంది" అన్నారు. 

"ఇక దర్శకుడిగా ప్రశాంత్ కుమార్ ఏదైతే చెప్పాడో అదే తీశాడు. ఆయన ఒక ఎమోషనల్ సీన్ చెబుతున్నప్పుడే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కామెడీని .. సెంటిమెంటును పట్టుకుని ముందుకు వెళితే తప్పకుండా ఆయన పెద్ద డైరెక్టర్ అవుతాడు. సంతోష్ శోభన్ - గౌరీ ఇద్దరూ చాలా బాగా చేశారు. అవకాశం ఇస్తే ఆడపిల్లలు అద్భుతాలు చేయగలరనే విషయాన్ని నిరూపించే సినిమా అవుతుంది" అంటూ ముగించారు. 

Santosh Sobhan
Gowry Kishan
Sridevi Sobhan Babu Movie
  • Loading...

More Telugu News