Chandrababu: జగన్ ఎలా దోచేస్తున్నాడు అనేది ప్రజలు తెలుసుకోవాలి: చంద్రబాబు

Chandrababu tours in East Godavari district

  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబుకు రాజమండ్రి విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం భారీ వాహన శ్రేణితో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి జగ్గంపేట రోడ్ కు తరలివెళ్లారు. అక్కడ తనకు స్వాగతం పలికిన మహిళలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు....

•   మహిళల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీడీపీ
•   మహిళలకు ఆస్తి హక్కు, విద్యారంగంలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ
•   మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్
•   డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన పార్టీ టీడీపీ
•   నేడు మహిళలు పురుషులకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అదీ మహిళా శక్తి.
•   వైసీపీ ప్రభుత్వం పన్నులు బాదుడుతో ప్రజలను బాదేస్తుంది.
•   రాష్ట్ర ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం
•   చివరికి చెత్త పైనా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది.
•   సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి మీ నుంచి రూ.50 కాజేస్తున్న ప్రభుత్వం గురించి మీరు తెలుసుకోవాలి.
•   జగన్ ఎలా దోచేస్తున్నాడు అనేది ప్రజలు తెలుసుకోవాలి
•   జగన్ ఒక రంగుల పిచ్చోడు....ప్రతి దానికీ జగన్ తన పార్టీ రంగులు వేసుకుంటాడు. మౌనంగా ఉంటే మీ మోహాలకు రంగులు వేస్తాడు.
•   మీ భూములు సర్వే చేసి... జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నాడు
•  జగన్ ఇప్పుడు ప్రజల ఇళ్లపై 'నువ్వే మా నమ్మకం' అని కొత్తగా స్టిక్కర్ లు వేస్తాడట. నువ్వే మా నమ్మకం కాదు... నువ్వే మా దరిద్రం అని ప్రజలు అంటున్నారు.
•  వైసీపీ పని అయిపోయింది... ఇక గెలిచే అవకాశం లేదు.
•   జగన్ ను ఇంటికి పంపుదాం. సైకో పోవాలి... సైకిల్ రావాలి.

Chandrababu
East Godavari District
TDP
Jagan
YSRCP
  • Loading...

More Telugu News