Dharmana Prasada Rao: మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే సీఎం జగన్ అమలు చేస్తున్నారు: ధర్మాన

Dharmana opines on three capitals issue

  • ఏపీ రాజధాని అంశంపై మరోసారి రాజకీయ దుమారం
  • శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం నడుచుకుంటున్నామన్న ధర్మాన
  • నిపుణుల నివేదికను గత సర్కారు బుట్టదాఖలు చేసిందని ఆరోపణ

ఏపీ రాజధాని అంశంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తుండడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అమలు చేపట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. 

పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడతాయని, అందుకే మూడు రాజధానులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే సీఎం జగన్ అమలు చేస్తున్నారని ధర్మాన స్పష్టం చేశారు. 

మూడు రాజధానుల అంశం విస్తృత ప్రయోజనాలతో కూడుకున్నదని తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Dharmana Prasada Rao
Three Capitals
YSRCP
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News