Ram Charan: చరణ్ కోసం రంగంలోకి దిగుతున్న ప్రభుదేవా!

shankar and charan movie update

  • శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా 
  • పాన్ ఇండియా స్థాయిలో జరుగుతున్న నిర్మాణం
  • ప్రత్యేకమైన పాటను ప్రభుదేవాకి అప్పగించిన శంకర్ 
  • వివిధ దేశాల్లో కొనసాగనున్న చిత్రీకరణ

కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవాకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. నటుడిగా .. దర్శకుడిగా కూడా తనని తాను నిరూపించుకున్నాడు. ఆ మధ్య బాలీవుడ్ లో దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఆయన, ఇటీవల కాలంలో మాత్రం నటనపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఒక రేంజ్ స్టార్స్ కి తప్ప ఇతర హీరోలకు ఆయన కొరియోగ్రఫీని అందించక చాలా కాలమే అయింది. 

దాంతో ఎక్కువ పాటలకు శేఖర్ మాస్టర్ .. జానీ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. ఇక ప్రేమ్ రక్షిత్ .. గణేశ్ ఆచార్య పేర్లు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ కోసం ఒక కొరియోగ్రఫర్ గా ప్రభుదేవా రంగంలోకి దిగుతున్నాడు. శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటకి ప్రభుదేవా డాన్స్ ను కంపోజ్ చేయనున్నాడు.

పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగానే వివిధ దేశాలకి చెందిన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. సినిమా హైలైట్స్ లో ఈ సాంగ్ ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇటు మెగా ఫ్యామిలీతోను .. అటు శంకర్ తోను ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రభుదేవా ఒప్పుకోవటం జరిగిందని చెబుతున్నారు. కియారా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. సునీల్ .. వెన్నెల కిశోర్ .. అంజలి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.  

Ram Charan
Kiara Adwani
Shankar
Prabhudeva
  • Loading...

More Telugu News