Sharukh khan: జూమే జో పఠాన్.. పాటకు మైదానంలో కోహ్లీ డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Shah Rukh Khans Verdict On Kohli and Jadeja Pathaan Dance Steps

  • వీడియో ట్వీట్ చేస్తూ తనకంటే బాగా చేశాడని బాద్ షా కితాబు
  • నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఘటన
  • ప్రేక్షకులు మొబైల్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొత్త సినిమా పఠాన్ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని జూమే జో పఠాన్.. పాట దేశవ్యాప్తంగా షారూఖ్ అభిమానులతో పాటు డ్యాన్స్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. సెలెబ్రెటీల నుంచి సామాన్యుల దాకా జూమే జో పఠాన్ అంటూ స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజాగా ప్రముఖ క్రికెటర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ పాటకు సరదాగా కాలు కదిపారు. మైదానంలోనే డ్యాన్స్ చేశారు. నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

మైదానంలో నిలుచున్న కోహ్లీ, పక్కనే ఉన్న రవీంద్ర జడేజా సరదాగా పఠాన్ పాటకు స్టెప్పులేశారు. జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా వారి పక్కనే ఉన్నారు. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకులలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాలలోనే వైరల్ గా మారింది.

తాజాగా ఈ వీడియోపై షారూఖ్ ఖాన్ స్పందించారు. వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసి.. కోహ్లీ, జడేజాలు తనకంటే బాగా డ్యాన్స్ చేశారని, వారి నుంచి తనే నేర్చుకోవాలంటూ కామెంట్ చేశారు.

More Telugu News