: షీలాదీక్షిత్ పై అరవింద్ కేజ్రీవాల్ పోటీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కు వ్యతిరేకంగా పోటీ చేయనున్నారని సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారమే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో 12 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు వీలున్న 44 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రికార్డు స్థాయిలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా సేవలందించారు. గత కొద్ది కాలంగా ఢిల్లీలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. దీంతో గత ఏడాదిగా ఢిల్లీ నగరంలో ఏవో ఒక నిరసనలతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించడం షీలా దీక్షిత్ కు అంత సులువుగా కన్పించడం లేదు.

  • Loading...

More Telugu News