Laksh Chadalavada: 'ధీర' నుంచి అధరం మధురం .. సాంగ్ రిలీజ్

Dheera Song Released

  • లక్ష్ చదలవాడ హీరోగా రూపొందుతున్న 'ధీర'
  • చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకున్న సినిమా 
  • దర్శకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్ శ్రీనివాస్
  • సంగీతాన్ని అందించిన సాయికార్తీక్  

ఎన్నో పాటలు వస్తుంటాయి కానీ అందులో కొన్ని మాత్రమే సంగీత ప్రియుల మనసు దోచుకుంటూ సూపర్ హిట్ ట్రాక్ లో వెళ్తుంటాయి. అలాంటి టార్గెట్ పెట్టుకొని యంగ్ హీరో లక్ష్ చదలవాడ 'ధీర' మూవీ నుంచి, ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. 'అధరం మధురం.. వదనం మధురం .. నయనం మధురం' అంటూ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ట్యూన్ తో సాగిపోతున్న ఈ పాటలో ప్రతి దృశ్యం మనసును పట్టుకుంటుంది. 

ప్రేయసి ఆలోచనలు .. ఆమె జ్ఞాపకాలతో ప్రియుడి గాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తూ బాలాజీ రాసిన లిరిక్స్ సంగీత ప్రియుల మనసులను దోచుకుంటుంది. అనురాగ్ కులకర్ణి - శృతి ఆలాపన ఎంతో ఆకట్టుకుంటోంది. హీరో లక్ష్ చదలవాడ డాన్స్ ఈ పాటకు మేజర్ అసెట్ అని చెప్పుకోవచ్చు. లిరిక్స్‌కి తగ్గట్టుగా సాయికార్తీక్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవల్ ను పెంచేశాయి. టోటల్ గా చూస్తే ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ తో 'ధీర' సినిమాపై అంచనాలు పెంచేశారు.  

 గతంలో 'వలయం' ..  'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాలతో సక్సెస్ అందుకున్న లక్ష్ చదలవాడ, ఇప్పుడు అదే జోష్ లో 'ధీర' సినిమాతో పలకరించనున్నాడు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో, నేహా పతన్ ..  సోన్యా భన్సాల్ ..  'మిర్చి' కిరణ్ .. హిమజ .. భరణి శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందనీ, త్వరలోనే రిలీజ్ చేయనున్నామని మేకర్స్ తెలియజేశారు.

Laksh Chadalavada
Neha pathan
Dheera Movie

More Telugu News