Buggana Rajendranath: ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థికమంత్రి బుగ్గన

Buggana comments on AP Capital

  • బెంగళూరు రోడ్ షోలో పాల్గొన్న బుగ్గన
  • విశాఖ ఒక్కటే రాజధాని అని స్పష్టీకరణ
  • 3 రాజధానులు అంటూ మిస్ కమ్యూనికేట్ అయిందని వెల్లడి
  • కర్నూలు రెండో రాజధాని కాదని వివరణ
  • అక్కడ హైకోర్టు ప్రధాన బెంచ్ మాత్రమే ఉంటుందని వ్యాఖ్యలు

విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు చేపడుతున్నారు. నిన్న బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని, ఏపీ పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని స్పష్టం చేశారు. తద్వారా ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అని సంకేతాలు ఇచ్చారు.

బుగ్గన ఇంకా ఏమన్నారంటే...

  • ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ వాస్తవం కాదు.
  • అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా చూస్తే ఏపీ రాజధానిగా విశాఖే బెస్ట్.
  • రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే జరుగుతుంది. మా ప్రభుత్వ నిర్ణయం కూడా అదే.
  • విశాఖ ఇప్పటికే ఓడరేవు నగరంగా, కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందింది.
  • భవిష్యత్ లోనూ విశాఖ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంది. 
  • కర్నూలు రెండో రాజధాని కాదు... అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్ ఉంటుందంతే.
  • కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్గాలలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయి. ఏపీలోనూ అంతే.
  • 1937 శ్రీబాగ్ ఒప్పందంలో... రాజధాని ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉండాలని పేర్కొన్నారు.
  • కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు బెళగాంలో ఒక సెషన్ నిర్వహిస్తారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఓ సెషన్ గుంటూరులో జరుగుతాయి.

Buggana Rajendranath
AP Capital
Visakhapatnam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News