Sai Pallavi: తెలుగు వెబ్ సిరీస్ కి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్?

Sai Pallavi in Telugu WebSeries

  • యూత్ లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ 
  • 'విరాట పర్వం' తరువాత కనిపించని సాయిపల్లవి 
  • రెండు తమిళ సినిమాలతో బిజీ 
  • శేఖర్ కమ్ముల శిష్యుడితో వెబ్ సిరీస్ చేసే ఛాన్స్

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది. సహజమైన నటన .. డాన్స్ ఆమె అభిమానుల సంఖ్యను పెంచేసింది. సాయిపల్లవి ఎంచుకునే కథలు .. పాత్రలు కూడా విభిన్నంగా .. వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందువలన ఆమెకి ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది. 

సాయిపల్లవి చేతిలో సినిమాలు లేవంటే ఆమెకి అవకాశాలు రావడం లేదు అని కాదు .. ఆమెకి నచ్చిన కథలు రాలేదు అనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తనకి నచ్చితేనే తప్ప ఆమె ఏ సినిమాను ఒప్పుకోదు. అలాంటి సాయిపల్లవి పేరు 'విరాటపర్వం' తరువాత ఏ తెలుగు ప్రాజెక్టులోను వినిపించడం లేదు. తమిళంలో మాత్రం ఆమె ధనుశ్ సరసన .. శివ కార్తికేయన్ జోడీగా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ఆమె ఒక తెలుగు వెబ్ సిరీస్ చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల శిష్యుడు 'నెట్ ఫ్లిక్స్' కోసం ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశాడట. నాయిక ప్రధానమైన ఈ కథకు సాయిపల్లవి అయితే కరెక్టుగా ఉంటుందని భావించి ఆమెను సంప్రదించినట్టు సమాచారం. సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు.  

Sai Pallavi
Dhanush
Shiva Karthikeyan
Kollywood
  • Loading...

More Telugu News