polluted city: అత్యంత కలుషిత నగరంగా ముంబై: ఐక్యూ ఎయిర్

Mumbai ranks second most polluted city in the world in weekly ranking

  • గతేడాది నవంబర్, ఈ ఏడాది జనవరిలో గాలి నాణ్యత ‘వెరీ పూర్’
  • వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీని వెనక్కి నెట్టిన ముంబై
  • స్విస్ పరిశోధనా సంస్థ ఐక్యూ ఎయిర్ వీక్లీ రిపోర్టులో వెల్లడి

దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై ఇప్పుడు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ విషయంలో రాజధాని ఢిల్లీని వెనక్కినెట్టింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 తేదీల మధ్య కాలానికి నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారుచేసింది. ఇందుకోసం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సమాచారం సేకరించినట్లు ఐక్యూ ఎయిర్ తెలిపింది.

గతేడాది నవంబర్ తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఎగిసిపడే దుమ్ముధూళి వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News