Nani: అందులో ఎంతమాత్రం నిజం లేదు: 'దసరా' సాంగ్ లాంచ్ ఈవెంటులో నాని

Dasara Movie Song Launch Event

  • నాని తాజా చిత్రంగా రూపొందిన 'దసరా'
  • సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో సాగే కథ
  • దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయం  
  • సంగీతాన్ని సమకూర్చిన సంతోష్ నారాయణ్ 
  • మార్చి 30వ తేదీన సినిమా రిలీజ్   

నాని - కీర్తి సురేశ్ జంటగా 'దసరా' సినిమా రూపొందింది. ఎస్.ఎల్.వి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సింగరేణి బొగ్గుగనులకి సమీపంలో గల ఒక గ్రామం .. ఆ గ్రామం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మాస్ లుక్ తో ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు.

కొంతసేపటి క్రితం హైదరాబాదులోని AMB సినిమాస్ - స్క్రీన్ 1లో  ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. సాంకేతిక సమస్య వలన లిరికల్ సాంగ్ ను ఆలస్యంగా రిలీజ్ చేశారు. 'ఓరి వారి నీదు గాదుర పోరీ' అంటూ ఈ పాట మొదలవుతోంది. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ బాణీకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు.

నాని మాట్లాడుతూ .. "ఇది నా కెరియర్లోనే బెస్ట్ సాంగ్ .. వినేకొద్దీ ఎక్కేస్తుంది. ఈ సినిమాలో నేను సిల్క్ స్మిత ఫ్యాన్ ని అని రాస్తున్నారు .. అందులో ఎంతమాత్రం నిజం లేదు. సిల్క్ స్మిత పోస్టర్ ను ఎందుకు చూపిస్తున్నామనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే" అని అన్నాడు. సముద్రఖని .. సాయికుమార్ .. దీక్షిత్ శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు

Nani
Keerthi Suresh
Samudrakhani
Dasara Movie

More Telugu News