Santhosh Sobhan: ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమాలు ఇవే!

This week OTT Movies

  • ఈ వారంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి చిన్న సినిమాలు
  •  ఈ నెల 15వ తేదీ నుంచి హాట్ స్టార్ లో 'మాలికాపురం'
  • 17వ తేదీ నుంచి 'ఆహా'లో 'కల్యాణం కమనీయం'
  • అదే రోజు నుంచి 'ఆహా'తో పాటు అమెజాన్ ప్రైమ్ లో 'గాలోడు' సందడి
  • త్వరలోనే ప్రకటించనున్న 'బుట్టబొమ్మ' .. రైటర్ పద్మభూషణ్' స్ట్రీమింగ్ డేట్స్   

ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై చిన్న సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో 'మాలికాపురం' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఉన్ని ముకుందన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మలయాళంలో మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. 

ఇక 17వ తేదీ నుంచి 'కల్యాణం కమనీయం' సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై నుంచి పలకరించనుంది. 'ఆహా'లో ఈ సినిమా స్ట్రీమింగ్ జరగనుంది. సంతోష్ శోభన్ - గెహనా సిప్పీ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్ల నుంచి అంతగా రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక అదే రోజున సుడిగాలి సుధీర్ 'గాలోడు' సినిమా 'ఆహా'తో పాటు అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ నెల 23 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో 'వీరసింహారెడ్డి' .. 27వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 'వాల్తేరు వీరయ్య' సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అందుకు సంబంధించిన ట్రైలర్స్ కూడా సందడి చేస్తున్నాయి. 'నెట్ ఫ్లిక్స్'లో 'బుట్టబొమ్మ' .. 'జీ 5'లో 'రైటర్ పద్మభూషణ్' స్ట్రీమింగ్ కానున్నాయి. స్ట్రీమింగ్ డేట్స్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

More Telugu News