Jagan: గవర్నర్ దంపతులను కలిసిన జగన్ దంపతులు

Jagan meets Governor Harichandan

  • ఛత్తీస్ గఢ్ కు బదిలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్
  • మూడున్నరేళ్ల పాటు ఏపీకి సేవలు
  • రాజ్ భవన్ కు వెళ్లిన జగన్, భారతి

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహూకరించారు. 

ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మూడున్నరేళ్ల పాటు ఏపీకి గవర్నర్ గా సేవలందించినందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే.  


Jagan
YSRCP
Biswabhusan Harichandan
  • Loading...

More Telugu News